Sunday 8 October 2017

సమాచారం
7-12-2017, 10.20 Pm

జన విజ్ఞాన వేదిక జాతీయ లఘు చిత్రాల పోటీలో పాల్గొన్న సృజనశీలురైన దర్శకులకు, నిర్మాతలకూ, ఇతర భాగస్వాములకు ధన్యవాదాలు. తేదీ 9-12-2017, శనివారం నాడు కాకినాడ జే.ఎన్.టి.యు. ఆలమ్ని ఆడిటోరియం లో   జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమలో పాల్గొనేందుకు మీ వద్ద నుండి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది.
        ఈ కార్యక్రమం లో మొదటి మూడు బహుమతులతో పాటు పది కన్సోలేషన్ బహుమతున్నాయని తెలియజేయడం జరిగింది. వాటితో పాటు 40  చిత్రాలకు జ్ఞాపికలు అందజేస్తామని  ప్రకటించాం. అయితే వచ్చిన స్పందన, పాల్గొన్న వారి నిబద్ధత  దృష్ట్యా పోటీలో పాల్గొన్న 124  మందికీ జ్ఞాపిక మరియు సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పోటీలకు షార్ట్ ఫిలిం లు పంపిన వారంతా చక్కటి ప్రతిభను, నిబద్ధతనూ ప్రదర్శించారు. అభినందనలు. 
         ఇక షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో విజేతల వివరాలు సభలో మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. న్యాయ నిర్ణయ ప్రక్రియ నల్గురు న్యాయ నిర్ణేతల వద్ద జరుగుతోంది. వారంతా 9వ తేదీ ఉదయానికి మాత్రమే తమ నిర్ణయాన్ని తెలియజేస్తారు. వాటన్నిటినీ క్రోడీకరించి ఫలితాలను సాయంత్రం ప్రకటించడం జరుగుతుంది.  న్యాయ నిర్ణయ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. జన విజ్ఞాన వేదిక నిబద్ధతకు ప్రముఖ స్తానం ఇస్తుందని మీకు తెలుసు. 
        9వ తేదీన కాకినాడ లో జరుగుతున్న జన విజ్ఞాన వేదిక షార్ట్ ఫిలిం  ఫెస్టివల్ షార్ట్ ఫిలిం భాగస్వాములైన మీ అందరికీ ఒక చక్కటి వేదిక గా, ఆత్మీయుల కలయికగా ఉంటుంది. సృజనశీలురైన వారి ఆలోచనలను పంచుకుందాం. ఎంతో అనుభవజ్ఞులైన దర్శకులు , నిపుణులు తమ  అనుభవాలు మనతో పంచుకుంటారు. ఆ విధమైన ఆలోచనతో సభకు రావాల్సింది గా విజ్ఞప్తి. క్రీడా స్ఫూర్తి తో ఎవరు విజేతలైనా అందరూ అభినందిద్దాం. ఒకవేళ ఎవరైనా సమావేశానికి రాలేకపోతే వారి జ్ఞాపిక, సర్టిఫికేట్ లు కొరియర్ లో వారి చిరునామాకు పంపిస్తాం. విజేతలైతే వీటిని బహుమతి చెక్ తో కలసి పంపిస్తాం. 
       షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యే వారికి ఉదయం 8.30 నుండి 9.30 వరకు అల్పాహారం, మధ్యాహ్నం 1 నుండి 2 వరకు  భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రూపంలోనూ ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. జన విజ్ఞాన వేదిక తూర్పు గోదావరి జిల్లా శాఖ వారి ఆత్మీయ ఆతిధ్యాన్ని అందరం స్వీకరిద్దాం. ఈ చక్కటి కలయిక మధురానుభూతులతో తిరిగి వెళ్దాం. 
   హైదరాబాద్ నుండి కాకినాడ నేరుగా కొన్ని ట్రైన్లు ఉన్నాయి. లేదా సామర్లకోట రైల్వే స్టేషన్ లో దిగి దాని ఎదురుగా గల కాంప్లెక్స్ నుండి ప్రతి 5 నిముషాలకూ కాకినాడకు బస్సులుంటాయి. (20నిముషాల ప్రయణం)

కార్యక్రమ వివరాలు 
ఉదయం 9 గంటల నుండి రిజిస్ట్రేషన్ 
10 గంటలకు: జాతీయ లఘు చిత్రాల పోటీ ప్రారంభ సభ 
11.30 నుండి 1.00 వరకు   20లఘు చిత్రాల ప్రదర్శన 
1.00   భోజన విరామం 
2.00 నుండి 3 గంటల వరకు    20 లఘు చిత్రాల ప్రదర్శన 
3.30  బహుమతిప్రదాన సభ 
5.30 వందన సమర్పణ. 

      ఈ అద్భుత కార్యక్రమంలో భాగస్వాములవుతున్న  ప్రతిఒక్కరికీ పేరుపేరునా అభినందనలు మరియు ధన్యవాదాలు.
- శంకర ప్రసాద్, ఫణీంద్ర, సత్తిరెడ్డి, జాన్సన్  



ముఖ్య గమనిక

1.12.2017, 4.30 PM

జన విజ్ఞాన వేదిక జాతీయ లఘు చిత్రాల పోటీకి ఎంట్రీలు పంపిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, ఆస్ట్రేలియా మిత్రులందరికీ అభినందనలు.  ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం 30వ తేదీలోగా పంపిన వారి ఎంట్రీలు స్వీకరించడం జరిగింది. గడువు పెంపు లేదు. అయితే కొద్దిమంది గడువులోగా పోస్ట్ చేసి అవి మార్గమధ్యంలో ఉన్నాయని చెప్తున్నారు. అటువంటి వారు పోస్ట్ చేసిన లేదా కొరియర్ చేసిన రశీదు, అప్లికేషన్లు, వారి షార్ట్ ఫిలిం గూగుల్ డ్రైవ్ లింక్ ఈరోజు (1.12.2017) ఉదయం 8 గంటలలోగా మెయిల్ ద్వారా ( jvvnet@gmail.com) కు పంపాలని sms ద్వారా తెలియజేశాము. ఆ సమాచారం అందని మిత్రులు ఈరోజు (1.12.2017) రాత్రి 10 గంటల లోగా పైన పేర్కొన్న విధంగా మెయిల్ చేయాలని కోరుతున్నాం. ఎంట్రీల స్వీకరణ ఈరోజు రాత్రి 10 గంటలకు పూర్తి అవుతుంది. అయితే dvd లు మరియు దరఖాస్తు పంపకుండా కేవలం లింక్ మాత్రమే పంపేవారి షార్ట్ ఫిల్మ్ లు పోటీకి స్వీకరింపబడవు. గమనించగలరు. మార్గమధ్యంలో ఉన్న మీ dvd లు 2వ తేదీ రాత్రి 8 గంటలలోగా  తప్పని సరిగా చేరాలి. ఆ తరువాత జరిగే ఆలస్యానికి, పోస్టల్/ కొరియర్ల  జాప్యానికీ మా బాధ్యత లేదు. ఎంట్రీల స్వీకరణ పూర్తి అయిందని గుర్తించాలి. మొత్తం ఎంట్రీలు 3 వ తేదీ ఉదయం ప్రకటిస్తాం. జనవిజ్ఞాన వేదిక నిర్వహణ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. 3వ తేదీ నుండి 8వ తేదీవరకు న్యాయ నిర్ణయ ప్రక్రియ, 9వ తేదీ కాకినాడ JNTU యూనివర్సిటీ లో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఏర్పాట్లు ఉన్నందున పోటీలకు నిర్వాహకులకు అత్యవసర సమయంలో తప్ప ఫోన్ చేయవద్దని కోరుతున్నాం. అవి కూడా ఉదయం 6 నుండి 8 వరకూ, సాయంత్రం 6 నుండి 8 వరకూ మాత్రమే చేయాలని  కోరుతున్నాం. 

- మల్లారెడ్డి శంకర ప్రసాద్, ఎం.వి.ఆర్. ఫణీంద్ర, 
జే.వీ.వీ. నెట్ వర్క్ టీం. 







Last Date for Submission of the Entries:

30th November, 2017


ముఖ్య గమనిక 

జన విజ్ఞాన వేదిక జాతీయ లఘు చిత్రాల పోటీకి అద్భుత స్పందన రావడం ఎంతో సంతోషాన్నిస్తోంది.

తేదీ 9.12.2017, శనివారం, ఉదయం 10గంటలకు కాకినాడ జే.ఎన్.టి.యు. యూనివర్సిటీ అలుమ్ని హాల్ లో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ హాల్ లో 300 మంది కూర్చోవడానికి చక్కటి ఏర్పాట్లున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు స్తానిక యూనివర్సిటీ, వివిధ కళాశాలల నుండి పెద్ద ఎత్తున విద్యార్ధులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని షార్ట్ ఫిలిం పార్టిసిపంట్స్ తమ రాక  వివరాలను ముందుగా తెలియజేయాలని కోరుతున్నాం. మీరు ఎంతమంది హాజరౌతారో చూసిన తరువాత మిగిలిన సీట్లను మాత్రమే ఇతరులకు కేటాయించడం జరుగుతుంది. కనుక
మీరు ఎంతమంది వస్తున్నదీ వెంటనే తెలియజేయగలరు. (sms ద్వారా)  బహుమతులతో పాటు  ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ తరపున సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అనుభవజ్ఞులైన దర్శకుల సూచనలూ  అందుకోవచ్చు. ఈ విషయమై వెంటనే స్పందించగలరు. 

- ఫణీంద్ర, శంకర ప్రసాద్, నెట్ వర్క్ కమిటీ, జేవీవీ.

Mobile: 9963975088


PLEASE PRESS THE LINK TO GET THE APPLICATION FOR SHORT FILM CONTEST. 
Submit the application along with the DVDs of the short film 


Link for Application